ఈ వారం వివిధ కార్యక్రమాలు 15-01-2024

Written by RAJU

Published on:

‘విభజిత’ కథా సంపుటి

విజయ భండారు కథా సంపుటి ‘విభజిత’ ఆవిష్కరణ సభ జనవరి 18 సా.6గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో ఓల్గా, శీలా సుభద్రాదేవి, మామిడి హరికృష్ణ, వి. సంధ్య, మానస ఎండ్లూరి, నందిగాం నిర్మల పాల్గొంటారు.

హస్మిత ప్రచురణలు

బాలల కథా సంకలనాలకు ఆహ్వానం

తెలంగాణ సారస్వత పరిషత్తు వెలువరిస్తున్న ‘బాల సారస్వతం’ పరంపరలో ప్రచురించే బాల కథా సంకలనాల కోసం కథలను ఆహ్వానిస్తున్నాం. బాలల మూర్తిమత్వ వికాసం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ బాంధవ్యాలు తదితర అంశాలను స్వీకరించి ఏ4 సైజులో ఒకటిన్నర పేజీకి మించకుండా టైప్‌ చేసి పంపాలి. కథలను జనవరి 20లోగా ఈమెయిల్‌: ్ట్ఛజ్చూుఽజ్చుఽ్చట్చట్చటఠ్చ్టీజ్చిఞ్చటజీటజ్చ్టిజిఃజఝ్చజీజూ. ఛిౌఝ కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్‌: 88852 45234.

జె. చెన్నయ్య

కథా సంపుటాలకు ఆహ్వానం

కందికొండ రామస్వామి స్మారక పురస్కారం కోసం 2023లో ముద్రితమైన కథా సంపుటాలను పంపాలి. బహుమతి పొందిన సంపుటికి నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక తరఫున ఏప్రిల్‌లో పదివేల రూపాయల నగదు, పురస్కారం, జ్ఞాపిక ప్రదానం జరుగును. మీ కథా సంపుటాలు మూడేసి ప్రతులను జనవరి 31లోగా చిరునామా: అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌, ఇంటి నెం. 15-120/4/1, రహత్‌ నాగర్‌ కాలనీ, నాగర్‌ కర్నూల్‌ – 509209, తెలంగాణకు పంపాలి. వివరాలకు: 94927 65358.

వనపట్ల సుబ్బయ్య

నవలలకు ఆహ్వానం

రజనీశ్రీ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి నవలలను ఆహ్వానిస్తున్నాం. ఈ పురస్కారం కింద ప్రశంసా పత్రం, శాలువాతో పాటు రూ.10,116/- నగదు ఉంటుంది. రచయితలు జనవరి 1, 2014 నుంచి డిసెంబర్‌ 31, 2023 మధ్య ముద్రితమైన వారి సొంత నవలలు నాలుగు ప్రతులను ఫిబ్రవరి 10లోగా చిరునామా: గాజుల రవీందర్‌, ఇం.నెం.: 8-3-255/1, రామచంద్రాపూర్‌ కాలనీ, రోడ్‌ నంబర్‌ 12, భగత్‌ నగర్‌, కరీంనగర్‌ – 505001కు పంపాలి. మరిన్ని వివరాలకు ఫోన్‌: 98482 55525.

గాజుల రవీందర్‌

దళిత ప్రేమ కథలకు ఆహ్వానం

గత ఏడాది మార్జిన్స్‌ ప్రచురణల నుంచి మేం తెచ్చిన దళిత కథల సంకలనం ‘ముళ్ళ చినుకులు’కి వచ్చిన స్పందనతో చేస్తున్న మరో ప్రయత్నం దళిత ప్రేమ కథల సంకలనం. దళిత, దళితేతర రచయితలందరి నుంచి కథలను ఆహ్వానిస్తున్నాం. దళిత, ఇతర కులాల మధ్య చిగురించిన ప్రేమకథలే వస్తువు. చివరి తేదీ ఏప్రిల్‌ 30. డిటిపి చేసిన కథని ఓపెన్‌ ఫైల్లో ఈమెయిల్‌: ఛ్చీజూజ్ట్చీఞట్ఛఝ్చజ్చ్టుజ్చిజూఠఃజఝ్చజీజూ.ఛిౌఝ కు ఈ మెయిల్‌ చెయ్యాలి.

మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights