ఈ పండు ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. పోషకాల గని.. ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంజీవని!

Written by RAJU

Published on:

ఈ పండు ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. పోషకాల గని.. ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు సంజీవని!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ఆరోగ్యం కోసం రోజుకో పండు తినమని వైద్యులు చెబుతుంటారు. మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో కొన్ని మన దేశవాలీ పండ్లు కాగా, మరికొన్ని విదేశీ పండ్లు ఉంటాయి. అంలాంటి పండ్లలో కివీ కూడా ఒకటి. ఖరీదులో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ పండులో అనేక పోషకాలు నిండి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే కివీ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోజుకో కివీ పండు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అస్సలు వదిలిపెట్టారు..

శరీరంలోని ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ కివీలో ఉంటుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కివీ పండులోని ఫైబర్, ఫైటోకెమికల్స్ కడుపు, పెద్దపేగుల్లో క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాదు..కివీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. కివీ పండులోని విటమిన్ సి, ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సిడేటివ్ నష్టం నుంచి రక్షించి యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

కివీ పండులో ల్యూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి వయసు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుంచి రక్షించి, దృష్టిని మెరుగుపరుస్తాయి. కివీ పండులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కివీ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కివీ పండులోని విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచి, ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights