ప్రస్తుతం వెయ్యి రూపాయలే..
ఈపీఎస్ కింద ప్రస్తుత కనీస పెన్షన్ పెన్షనర్లకు నెలకు రూ.1,000 నుండి రూ.2,000 వరకు ఉంది. ఇది సెప్టెంబర్ 1, 2014నుంచి అమల్లో ఉంది. కాగా, ఈపీఎస్ పథకం దాదాపు మూడు దశాబ్దాలుగా అమలులో ఉంది. నవంబర్ 16, 1995న దీనిని ప్రారంభించారు. అన్ని వ్యవస్థీకృత రంగాలలోని ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ ను అమలు చేస్తారు. ఈపీఎస్ కింద, యజమాని ప్రతి నెలా ఉద్యోగి జీతంలో 8.33%ని ఈపీఎస్ ఖాతాకు జమ చేయాలి. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిధులకు 1.16% రేటును అందించాల్సిన బాధ్యత ఉంది. ఈపీఎస్ పథకానికి సవరణ జరిగి దాదాపు దశాబ్దం గడిచింది. కనీస పెన్షన్ సవరణ జరిగి దాదాపు దశాబ్దం గడిచినందున, ట్రేడ్ యూనియన్లు మరియు ఇతర సంఘాలు ఈపీఎస్ పెంపును డిమాండ్ చేస్తున్నాయి.