
– లక్ష్మిపూర్ లో నేలరాలిన మామిడి… కూలిన విద్యుత్ స్థంభాలు
– మండల కేంద్రంలో పిడుగుపాటు.. వృద్దురాలు మృతి
నవతెలంగాణ-బెజ్జంకి
ఈదురుగాలులు.. వడగళ్ల వర్షం మండలంలో గురువారం భీభత్సం సృష్టించింది.మండల కేంద్రంలో ఈదురుగాలులకు ఇంటిపైకప్పు లేచి విద్యుత్ స్తంభంపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పండింది.
పిడుగుపాటుకు వృద్దురాలు మృతి
మండల కేంద్రానికి చెందిన టేకు రంగవ్వ, మనుమడు శ్రీదర్ తో కలిసి ఈదురుగాలులకు నేలరాలిన చింతకాయ సేకరణకు వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి వృద్దురాలు రంగవ్వను, స్పృహ కోల్పోయిన బాలుడు శ్రీదర్ ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వృద్దురాలు మృతి చెందగా.. బాలుడిని 108 అండులెన్స్ యందు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
లక్ష్మిపూర్ లో భీభత్సం..
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో ఈదురుగాలులు..వడగళ్ల వర్షం భీభత్సం సృష్టించింది.రైతు కరివేద సత్తిరెడ్డి సుమారు 5 ఎకరాల్లో సాగు చేసిన మామిడి కాయలు నేలరాలయి.సుమారు 6 విద్యుత్ స్తంభాలు నేరకూలయి.దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అదూకోవాలని రైతు సత్తిరెడ్డి విజ్ఞప్తి చేశారు.