ABN
, Publish Date – Mar 22 , 2025 | 04:53 AM
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన కుమారి లింగన్న(48) ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు.

తలమడుగు/వెంకటాపురం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన కుమారి లింగన్న(48) ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో సుమారు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లింగన్న.. శుక్రవారం పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లికి చెందిన లఖం మధుకృష్ణ(29) రెండెకరాలు కౌలుకు తీసుకుని హైటెక్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు వేశాడు.
రెండకరాలకు 8 టన్నుల దిగుబడి వస్తుందని, ఆ పంటను తామే కొనుగోలు చేస్తామని కంపెనీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. దాంతో మధుకృష్ణ అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. రెండు టన్నుల దిగుబడే రావడం, కంపెనీ వారు అడ్రస్ లేకపోవడంతో మధుకృష్ణ ఆందోళనకు గురయ్యారు. అప్పులు ఎలా తీర్చాలో, కౌలు ఎలా కట్టాలో పాలుపోక గురువారం పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.
Updated Date – Mar 22 , 2025 | 04:53 AM