మే 1 నుండి, దేశంలోని జాతీయ రహదారులపై రోడ్డు ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది. ఎందుకంటే కొత్త GPS ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ప్రారంభం కానుంది. దీంతో, FASTags కనుమరుగు కానుంది. వాస్తవానికి, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కావాలని భావించారు., కానీ అది ఆలస్యం అయింది. ఇప్పుడు ఇది మే 1, 2025 నుండి అమలు చేసే అవకాశం ఉంది.
ఇక నుంచి హైవే ఎక్కితే.. మైవే అంటూ జాలీగా వెళ్లిపోవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ పేరుతో టోల్‌గేట్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ట్యాగ్ విధానంలో ఒక వెహికల్‌కు టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే, ఆ ప్రభావంతో మిగిలిన వాహనాలు కూడా లేట్ అవుతుండడం చాలాసార్లు చూస్తున్నాం. ఇకపై టోల్‌గేట్ల దగ్గర వెహికల్‌ను ఆపాల్సిన అవసరమే లేదు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థ ఇకపై బంద్ కానుంది. GPS ఆధారిత టోల్ వసూళ్ల విధానం…GNSSను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో రోడ్డు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్‌లు కనిపించవు. త్వరలో ఇది అమల్లోకి రానుంది.
ఈ మార్పు వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనుంది. GNSS అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఉపగ్రహాల ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి, ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించేందుకు ఉపయోగించే టెక్నాలజీ. ఈ విధానంలో టోల్ ప్లాజా దగ్గర వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లు జరుగుతాయి.
జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్‌మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా వాహనం కచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తారు. వాహనం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ప్రయాణించిందో, ఆ దూరాన్ని లెక్కగడతారు. ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజును లెక్కించి, వాహనదారుడు లింక్ చేసిన బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ వాలెట్ నుంచి ఆటోమేటిక్‌గా క్యాష్ కట్ అయ్యేలా చూస్తారు.
GNSS విధానంలో టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి, ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుంది. ప్రయాణించిన దూరం ఆధారంగా చార్జీలు పడతాయి కాబట్టి, తక్కువ దూరం ప్రయాణించే వాహనదారులకు తక్కువ చార్జీలు పడతాయి. ప్రస్తుతం, GNSS వ్యవస్థను పలు జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు జాతీయ రహదారి, హర్యానాలోని పానిపట్-హిసార్ జాతీయ రహదారిలో ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మే 1 నుంచి దేశవ్యాప్తంగా GNSS వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మార్పు ద్వారా టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు ఎదురుచూడక్కర్లేదు. దీంతో వాహనదారుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
కొత్త వ్యవస్థ టోల్ బూత్‌లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని తొలగించడమే కాకుండా, వినియోగదారులకు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రక్రియలను కూడా అందిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..