– సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన చైనా రాయబారి
– నూతన ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీకి అభినందనలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇండియా, చైనా మధ్య సంబంధాలు బలపడాలని సీపీఐ(ఎం), చైనా నేతలు అభిప్రాయపడ్డారు. బుధవారం చైనా రాయబారి జు ఫీహాంగ్, దౌత్యవేత్తలు జౌ గువోహురు, గువో డోంగ్‌డాంగ్ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నూతన ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీకి అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పురాతన నాగరిత ఉన్న రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరగాలన్నారు. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జి జింగ్ పింగ్ మధ్య చర్చలు ఆహ్వానించదగినవని అన్నారు. రెండు దేశాల మధ్య, రెండు దేశాల ప్రభుత్వాల మధ్య, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతం అవసరమని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్ కుమార్ ఉన్నారు.

ఇండియా, చైనా మధ్య సంబంధాలు బలపడాలి

Written by RAJU
Published on: