
మన ఇల్లు మన జీవితానికి చాలా కీలకం. ఇంట్లోని ప్రతి వస్తువు మన శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని వస్తువులు పొరపాటుగా ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ 7 తప్పులను చేయకుండా జాగ్రత్త పడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమందికి పాత పత్రికలు, పుస్తకాలు, డైరీలు సేకరించే అలవాటు ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం అవి ఇంట్లో నిల్వ చేస్తే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంట్లో చెత్త ఎక్కువగా ఉంటే శుభ ఫలితాలు తగ్గి, ప్రతికూల శక్తి పెరుగుతుంది.
పూజా గదిలో ఉన్న దేవుళ్ల విగ్రహాలు లేదా ఫోటోలు పగిలిపోయినా.. మురికిగా మారినా వెంటనే వాటిని మార్చాలి. ఇలా పగిలిన విగ్రహాలను ఇంట్లో ఉంచడం వాస్తు దోషానికి కారణమవుతుంది. ఇది ఆర్థిక నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది.
పాత పెన్నులు, పాడైన గడియారాలు, పనిచేయని టీవీలు, ఇనుప పెట్టెలు వంటివి ఇంట్లో ఉంచడం మంచిది కాదు. వీటివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఇంట్లో పైకప్పుపై చెత్త పనికిరాని వస్తువులు నిల్వ చేసి ఉంచకూడదు. వాస్తు ప్రకారం ఇది కుటుంబ సభ్యుల మధ్య మానసిక ఒత్తిడిని, అనవసరమైన వివాదాలను పెంచుతుంది. ఇంట్లోని శుభ వైబ్రేషన్స్ దెబ్బతిని, అదృష్టం దూరమవుతుంది.
ఉపయోగించని తాళాలు, తాళం పెట్టని పెట్టెలు ఇంట్లో ఉంచడం వల్ల జీవితంలో ఆటంకాలు, సమస్యలు ఏర్పడతాయి. కనుక ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచకుండా తొలగించడం మంచిది.
కొంతమంది పనికిరాని వస్తువులను స్టోర్ రూమ్‌లో వేసి ఉంచుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మహాలక్ష్మీ దేవిని కోపానికి గురి చేస్తుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
చాలా మంది నిద్రించే సమయంలో తల దగ్గర వాటర్ బాటిల్ ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దీని ప్రభావంగా ఆలోచనల్లో గందరగోళం, నిద్రలేమి సమస్యలు రావచ్చు.
ఇంటి వాతావరణం పాజిటివ్‌గా ఉండాలంటే ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం చాలా అవసరం. ఇంట్లో శుభ శక్తి పెరగాలంటే అవసరం లేని చెత్తను తొలగించాలి. పూజా గదిలో శుభ్రత పాటించాలి. ప్రతికూల శక్తిని తొలగించడానికి ఈ మార్గదర్శకాలను పాటించి చూడండి.