ఇంటర్‌ ఉత్తీర్ణత‌తో పోస్టులు.. జీతమెంతంటే..!

Written by RAJU

Published on:

ఖాళీలు 1600

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు.

పరీక్ష: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: 2023 ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1996 ఆగస్టు 2 నుంచి 2005 ఆగస్టు 1 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ఠవయసులో సడలింపులు వర్తిస్తాయి.

జీతభత్యాలు

  • ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు రూ.19,900- 63,200

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.25,500 – 81,100

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-ఎకు రూ.29,200-92,300

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ప్రశ్నపత్రం: టైర్‌-1 పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. టైర్‌-2 పరీక్షకు 405 మార్కులు కేటాయించారు. ఇందులో మేథమెటికల్‌ ఎబిలిటీస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ మాడ్యుల్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, వరంగల్‌, కాకినాడ, కరీంనగర్‌, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 8

టైర్‌-1(కంప్యూటర్‌ ఆధారిత) పరీక్ష: ఆగస్టు

టైర్‌-2(కంప్యూటర్‌ ఆధారిత) పరీక్ష: వివరాలు తరవాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Updated Date – 2023-05-15T17:56:34+05:30 IST

Subscribe for notification