ఇంటర్మీడియట్‌ విద్య,AP Inter : మార్చిలో కాదు ఫిబ్రవరిలోనే పబ్లిక్‌ పరీక్షలు.. ఏప్రిల్ 1 నుంచే​ కాలేజీలు.. ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక మార్పులు – ap intermediate reforms 2025

Written by RAJU

Published on:

Intermediate Education in AP : ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక మార్పులు చేపట్టింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..

హైలైట్:

  • ఏపీ ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలు
  • ఏప్రిల్‌ 1 నుంచి అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభం
  • ఏప్రిల్‌ 7 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు స్టార్ట్‌
  • ఫిబ్రవరిలోనే పబ్లిక్‌ పరీక్షలు.. మార్చిలో కాదు
Samayam Teluguఏపీ ఇంటర్‌ విద్య సంస్కరణలు
ఏపీ ఇంటర్‌ విద్య సంస్కరణలు

AP Intermediate Reforms 2025 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి విద్యార్థులు ఎం.బైపీసీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మ్యాథ్స్‌లో ఏ, బీ పేపర్లు రద్దు చేసి ఇకపై 100 మార్కులకు ఒక్కటే పరీక్ష నిర్వహిస్తారు. అలాగే సైన్స్‌ సబ్జెక్టుల్లో మార్కులను 60 నుంచి 85కు పెంచారు. ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పలు కీలక సంస్కరణలకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఆమోదం తెలిపింది. ఇంటర్మీడియట్‌ బోర్డు విద్యామండలి 77వ సమావేశం మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో నిర్వహించారు.

ఇకపై ఎం.బైపీసీ గ్రూపు చదవొచ్చు

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో ఎం.బైపీసీ కోర్సు చదివే అవకాశం కల్పించారు. ఈ ఎం.బైపీసీ గ్రూపు చదవడం వల్ల విద్యార్థులు మెడికల్‌, ఇంజినీరింగ్‌ రెండింటికి అర్హత సాధిస్తారు. నీట్, జేఈఈ వంటి ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు రాసుకోవచ్చు. గతంలో ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపాదనను ఇంటర్మీడియట్‌ విద్యామండలి నిలిపివేసింది. ఈ ప్రతిపాదనలపై వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే.. ఇంటర్మీడియట్‌ విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కిషోర్‌ రెడ్డి

రచయిత గురించికిషోర్‌ రెడ్డికిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.
… ఇంకా చదవండి

Subscribe for notification