2024 సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారిన జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు ప్రభుత్వంలో తన మార్క్ పాలనను చూపిస్తూనే.. మరోవైపు పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే చేరికలపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన పలువురు కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొందరు పవన్ ఊ.. అంటే పార్టీలో చేరిపోయేందుకు రెడీగా ఉన్నారు.
వైసీపీని వీడబోయే వారి లిస్ట్ లో బొత్స సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స చూపు జనసేన వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించిన బొత్స ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణాల్లో పదే పదే వీరిమధ్య పలకరింపులు, ఆలింగనాలు చోటుచేసుకోవడంతో అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ సైతం బొత్స సత్యనారాయణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ఇన్‌సైడ్ బలంగా టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో ఐదేళ్లు బొత్స మంత్రిగా ఉన్నారు. రివేంజ్ రాజకీయాలకు ఆయనెప్పుడూ దూరమే. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణకు దక్కాల్సిన గౌరవం దక్కుతోంది.

అయితే వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న బొత్సను జనసేనలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న విషయంపై పార్టీ శ్రేణులతో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారట. పార్టీ శ్రేణులు నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఉత్తరాంధ్రలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గంలో బొత్స గట్టి పట్టున్న నేత. అటువంటి బొత్సను పార్టీలోకి తెచ్చుకుంటే జనసేన బలోపేతం అవ్వడంతో పాటు వైసీపీని గట్టి దెబ్బ కొట్టనట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.