తిరుమల గోశాలలో గోవులు చనిపోయాంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్వహణ సరిగ్గా లేకనే గత మూడు నెలల్లో వందకి పైగా ఆవులు బక్కచికి మృత్యవాత పడ్డాయని.. ఆవుల మరణాలను బయటకు రాకుండా అక్కడి అధికారులు దాచిపెడుతున్నారని భూమన ఆరోపణలు చేశారు. భూమన వ్యాఖ్యలపై టీటీడీ అధికారులు, కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, ప్రభుత్వంపై బురద జల్లేందుకే వైసీపీ నేతలు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే తాజాగా భూమన మరో బాంబ్ పేల్చారు. టీటీడీని ప్రక్షాళన చేశామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.. కానీ ఎక్కడ ప్రక్షాళన చేశారో అర్థం కావడం లేదంటూ భూమన వ్యాంగ్యం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న రెండు వేల మంది ఉద్యోగులు తమవారేనని, వారంతా తమ నిఘా నేత్రాలని భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వారి ద్వారా తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోందని.. టీటీడీ గోశాలలో గోవులు చనిపోయాయని తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని భూమన వ్యాఖ్యానించారు. ఆవుల మృతి విషయంలో టీటీడీ పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లో తేడా ఉందని భూమన ఫైర్ అయ్యారు. చనిపోయిన గోవులకు సంబంధించిన తాను చూపించిన ఫొటోలను మార్ఫింగ్ అని టీటీడీ వాళ్లు వైరల్ చేస్తున్నారు. కానీ భగవంతుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఆ ఫోటోలు టీటీడీ గోశాలలో తీసినవే.. ఈ విషయంలో ఏ విచారణకైనా తాను సిద్ధం అంటూ భూమన సవాల్ విసిరారు.
The post ఆ రెండువేల మంది మావారే.. మరో బాంబ్ పేల్చిన భూమన! first appeared on namasteandhra.