ఆ నమ్మకంతోనే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం

Written by RAJU

Published on:

ఆ నమ్మకంతోనే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాంహీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్‌ రూబా’. ఈ సినిమాలో రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. శివమ్‌ సెల్యులాయిడ్స్‌, ప్రముఖ మ్యూజిక్‌ లేబుల్‌ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్‌, రాకేష్‌ రెడ్డి, సారెగమ నిర్మాతలు. విశ్వ కరుణ్‌ దర్శకుడు. ఈ సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.
ప్రొడ్యూసర్‌ రవి మాట్లాడుతూ, ‘ సినిమా మీద నమ్మకంతో మేమే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం. అందుకే ఈ నెల 14న మార్నింగ్‌ షో అయిన వెంటనే సక్సెస్‌మీట్‌ కూడా పెట్టబోతున్నాం’ అని తెలిపారు. ‘ఈ సినిమా విషయంలో కిరణ్‌ మా కంటే ఎక్కువగా కథను, దర్శకుడినీ నమ్మారు. ఈ సినిమాతో కిరణ్‌కి, మా టీమ్‌ అందరికీ విజయం దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని ప్రొడ్యూసర్‌ రాకేష్‌ రెడ్డి చెప్పారు. హీరోయిన్‌ క్యాతీ డేవిసన్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రంలో మ్యాగీ క్యారెక్టర్‌లో నటించాను’ అని అన్నారు. ‘ఈ సినిమాలో అంజలి క్యారెక్టర్‌లో నటించాను. అంజలి క్యారెక్టర్‌ ఎనర్జిటిక్‌గా ఉంటూనే ఎంతో ఎమోషనల్‌ డ్రైవ్‌తో సాగుతుంది’ అని హీరోయిన్‌ రుక్సర్‌ థిల్లాన్‌ చెప్పారు. డైరెక్టర్‌ విశ్వకరుణ్‌ మాట్లాడుతూ, ‘కిరణ్‌ చేసిన ఫైట్స్‌, చెప్పే డైలాగ్స్‌ మిమ్మల్ని ఆకట్టు కుంటాయి. రీసెంట్‌గా సినిమా చూసి, టెన్షన్‌ పడకు సినిమా అదిరిపోయింది అన్నారు. అదే నమ్మకంతో చెబుతున్నా ఒక కొత్త కిరణ్‌ అబ్బవరంను స్క్రీన్‌ మీద చూస్తారు’ అని చెప్పారు.
సినిమా మీద ప్యాషన్‌తో ఊర్ల నుంచి వచ్చేవారిలో ఓ పదిమందికి ఏటా నేను సాయం చేస్తా. అది ఫుడ్‌ కానీ, షెల్టర్‌ కానీ, అవకాశాలు కానీయండి నా వల్ల చేతనైన సాయం వారికి చేస్తా. నా ప్రతి సినిమాలో 40 నుంచి 50 మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నా. ఇకపైనా ఆ ప్రయత్నం కొనసాగిస్తా. మొదట్లో ఈ సినిమాని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని భయపడిన మాట నిజం. అయితే ఇప్పుడు మా టీమ్‌ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ నెల 14న కాదు, 13 సాయంత్రమే ప్రీమియర్స్‌తో మా సక్సెస్‌ జర్నీ స్టార్ట్‌ కాబోతోంది.
– హీరో కిరణ్‌ అబ్బవరం

Subscribe for notification