ఆసుపత్రి నుంచి పసికందు అపహరణ | a ladies obbery baby

Written by RAJU

Published on:

పసిబిడ్డతో బస్సులో వెళ్లిపోతున్న మహిళను చింతూరులో పట్టుకున్న పోలీసులు

సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగింత

రంపచోడవరం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి 5 రోజుల పసికందును గుర్తు తెలియని ఓ మహి ళా అపహరించుకుని వెళ్లిపోగా పోలీసులు ప ట్టుకున్నారు. వివరాల ప్రకారం.. వై.రామవరం మండలం గుర్తేడు సమీపంలోని దుంపవలసకు చెందిన అందాల కళావతి 5రోజుల క్రితం రంప చోడవరం ఏరియా ఆసుపత్రిలో మగ బిడ్డకు ప్రసవించింది. మంగళవారం ఓ మహిళ నర్సు గా చెప్పుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఆ బిడ్డ తక్కువ బరువుతో జన్మించిందని, అత్యవస రంగా బాక్స్‌లో పెట్టాలని కామెర్లు వచ్చాయని వారిని నమ్మించి తీసుకెళ్లింది. కొంతసేపటికి తల్లిదండ్రులు పసిపిల్లల వార్డుకు వెళ్లి చూసు కోగా తమ బిడ్డ అక్కడలేదని గుర్తించారు. వెం టనే ఆసుపత్రి అధికారుల ద్వారా పోలీసు, ఐటీ డీఏ, రెవెన్యూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే శారు. తక్షణం రంపచోడవరం డీఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ డివిజన్‌ మొత్తాన్ని అప్రమత్తం చేశా రు. ఎక్కడిక్కడ వాహన తనిఖీలు నిర్వహిం చారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేప ట్టారు. ఈ క్రమంలో రంపచోడవరం ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ నుంచి ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాజోలు నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిందని సమాచారం తెలి యడంతో డీఎస్పీ చింతూరు సబ్‌ డివిజన్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. బస్సు చిం తూరు చేరుకోగానే పోలీసులు చుట్టుముట్టి పసి బిడ్డతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకు న్నారు. ఆరా తీయగా ఆ మహిళే పసిబిడ్డను అపహరించిందని గుర్తించారు. అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి ఆ పసి బిడ్డను వైద్యులతో పరీక్షించి మహిళను రంపచో డవరం తరలించారు. ఆ పసికందును తల్లి దం డ్రులకు అప్పగించారు. ఈ సంఘటనతో ఆసు పత్రిలో నిర్వహణలోపం,భద్రత తేటతెల్లమైంది.

కేసు నమోదు చేశాం : డీఎస్పీ

రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి పసికందును అపహరించిన కేసులో కత్తి అశ్విని అనే మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నామని డీఎస్పీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. పసికందును తల్లి దండ్రులకు అప్పగించి మీడియాతో మాట్లాడా రు. నిందితురాలిని పట్టుకోవడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. సమా వేశంలో సీఐలు ఆర్‌జె.రవికుమార్‌, సీహెచ్‌ గోపాలకృష్ణ, టి.దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐలు డి.భూష ణం, బి.వినోద్‌, పి.రమేష్‌, ట్రైనీ ఎస్‌ఐలు ఎస్‌. గిరిధర్‌బాబు, వి.సుజాత, సురేష్‌ పాల్గొన్నారు.

కు మరిన్ని చిత్రాల్లో నటించి కూనవరానికి, తన కుటుంబానికి, అభిమానులకు మంచి పేరు తీసుకువస్తానని పేర్కొన్నాడు.

Updated Date – Apr 02 , 2025 | 01:27 AM

Subscribe for notification
Verified by MonsterInsights