
ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లో జరిగిన హృదయ విదాకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది, ఇక్కడ ఒక నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో మంగళవారం(ఏప్రిల్ 8) రాత్రి 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను ఆర్పగలిగారు. ఇందుకు సంబంధించి అధికారులు బుధవారం ఈ సమాచారం ఇచ్చారు.
బుధవారం ఉదయానికి మొత్తం 20 మంది మరణించినట్లు స్థానిక అధికారులు నిర్ధారించినట్లు స్థానిక వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఈ సంఘటనలో ఇంకా చాలా మంది గాయపడ్డారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. మంటల నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఆసుపత్రి భవనంపై నుంచి కిందకు దూకినట్లు వెల్లడిచారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో నర్సింగ్ హోమ్‌లో చాలా మంది వృద్ధులు, సిబ్బంది ఉన్నారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ వెంటనే చర్యలు తీసుకుంది. కానీ మంటలు చాలా తీవ్రంగా ఉండటం వలన దానిని ఆర్పడానికి చాలా సమయం పట్టింది. చైనా వార్తా సంస్థ జిన్హువా ప్రకారం, ఈ సంఘటన తర్వాత స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం నుంచి రక్షించిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. స్థానిక అధికారుల పర్యవేక్షణలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతం అంతా ఆందోళన వాతావరణం నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..