అమెరికా స్టాక్ మార్కెట్లు..
వివిధ దేశాలపై ట్రంప్ టారీఫ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం సాయంత్రం అమెరికాపై చైనా భారీ మొత్తంలో టారీఫ్ని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిస్థితులు అమెరికాను మాంద్యంలోకి నెట్టుతాయన్న అంచనాల మధ్య ఆ దేశ స్టాక్ మార్కెట్లు విపరీతంగా నష్టాలను చూస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో ఆ దేశ సూచీలు, స్టాక్స్ విపరీతంగా పడ్డాయి. సోమవారం ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే డౌ జోన్స్ ఫ్యూచర్స్ (dow jones futures) దాదాపు 1500 పాయింట్ల డౌన్లో ఉంది. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 4శాతం, నాస్డాక్ 4శాతం, రసెల్స్ 2000 7శాతం డౌన్లో ట్రేడ్ అయ్యాయి.