ఆయిల్ ఫాం రాయితీ బాయిలు విడుదల…

Written by RAJU

Published on:

ఆయిల్ ఫాం రాయితీ బాయిలు విడుదల…– మంత్రి తుమ్మలకు రైతు సంఘం నేతలు కృతజ్ఞతలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గత నాలుగు ఏళ్ళుగా ఆయిల్ ఫాం సాగు దారులకు రాయితీ బకాయిలను ఏప్రిల్ 1 మంగళవారం రైతులు ఖాతాల్లో జమ కావడంతో బుధవారం తెలంగాణ ఆయిల్ ఫాం అసోసియేషన్ సంఘం నేతలు అశ్వారావుపేట పరిశ్రమ ప్రాంగణంలో సమావేశం అయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 24 న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ఈ బకాయిలు విషయం వాట్సాప్ సందేశం పంపగా నే ఆఘమేఘాల పై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖ అధికారులతో సంప్రదించే బకాయిలు చెల్లించాల్సి ఉంది గా ఆదేశాలు ఇచ్చారని సంఘం నేత ఆలపాటి రామ చంద్ర ప్రసాద్ హర్షం తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి సీతారామ స్వామి,శీమకుర్తి వెంకటేశ్వరరావు,మొగళ్ళపు చెన్నకేశవ రావు,ముళ్ళగిరి క్రీస్తు లు ఉన్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights