ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు : హీరో నితిన్‌ –

Written by RAJU

Published on:

హీరో నితిన్‌ నటించిన హైలీ యాంటిసిపేటెడ్‌ హీస్ట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో నితిన్‌ మాట్లాడుతూ, ‘ఇప్పటికే రిలీజ్‌ అయిన మూడు పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. నిన్న వచ్చిన ‘అది దా సర్ప్రైజ్‌’ పాట కూడా చాలా పెద్ద హిట్‌ అయింది. దిల్‌ రాజు వల్ల ఆ వర్డ్‌ పాపులర్‌ అయింది కాబట్టి ఆయనకి థాంక్స్‌ చెప్తున్నాను. జీవి ప్రకాష్‌ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. డైరెక్టర్‌ వెంకీ, నేను నిన్న రాత్రి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా మా కెరీర్‌కి హ్యుజ్‌ మూవీ కాబోతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నా బర్త్‌ డే ఈనెల 30. ఈ సినిమా వచ్చేది ఈనెల 28న. డైరెక్టర్‌ వెంకీ ఈ సినిమాతో నాకు బిగ్గెస్ట్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ ఇవ్వబోతున్నారు. ‘భీష్మ’కి డబుల్‌ ఎంటర్టైన్మెంట్‌ ఈ సినిమాలో ఉంటుంది. నేను, శ్రీలీల, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌.. మా సీన్స్‌ చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. చాలా క్లీన్‌ కామెడీ ఉంటుంది. ఎక్కడ అసభ్యకరమైన మాట ఉండదు. ఇంత ఆర్గానిక్‌ కామెడీ ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. ఈనెల 28న వెంకీ కుడుముల విశ్వరూపం చూడబోతున్నారు. క్లైమాక్స్‌ చూసిన తర్వాత ఆడియన్స్‌ వావ్‌ అంటారు. మైత్రి మేకర్స్‌ లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చేది కాదు. ఈ సినిమాతో వారు మరో సక్సెస్‌ చూడబోతున్నారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. వెంకీ నుంచి కొరుకునే వినోదం ఇందులో ఉంటుంది. నా క్యారెక్టర్‌ మీరా చాలా స్పెషల్‌. చాలా ఎంజారు చేస్తూ చేశాను. ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది’ అని హీరోయిన్‌ శ్రీలీల చెప్పారు.
డైరెక్టర్‌ వెంకీ కుడుముల మాట్లాడుతూ,’సినిమా పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. నా బెస్ట్‌ వర్క్‌ ఇదే. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా ప్రొడ్యూసర్‌ నవీన్‌, రవి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాకి బ్యాక్‌ బోన్‌ నితిన్‌. ఇందులో మంచి ఫన్‌ వుంది. మీరు సర్ప్రైజ్‌ అయ్యే ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో క్యామియో చేసిన డేవిడ్‌ వార్నర్‌కి థ్యాంక్స్‌’ అని తెలిపారు.
ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన 3 సాంగ్స్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్‌, యాక్షన్‌, ఫోటోగ్రఫీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ ఫార్మేట్‌లో ఇంతకంటే బెస్ట్‌ కమర్షియల్‌ సినిమా రాదేమో అనిపించింది. దర్శకుడు వెంకీ మంచి కమర్షియల్‌ ప్యాకెట్‌ సినిమా ఇచ్చాడు. హిలేరియస్‌ ఎంటర్టైన్మెంట్‌ ఉంది.
– నిర్మాత వై రవిశంకర్‌

Subscribe for notification