సప్తగిరి నటించిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.
దిల్ రాజు నేతత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో సప్తగిరి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి, వజ్ర మకుట దర గోవిందా.. ఈ మూడు సినిమాలు కమర్షియల్ జోనర్‌లో మెప్పించే చిత్రాలు చేశాను. ప్రజలు 100% ఆదరించారు. ఫన్ జోనర్‌లో కామెడీకి మంచి స్కోప్ ఉండే ఒక క్యారెక్టర్ చేయాలనుకున్నాను. అలాంటి సమయంలో ఈ ‘పెళ్లి కాని ప్రసాద్’ కథ వచ్చింది. స్క్రిప్ట్ విన్నాను చాలా నచ్చింది.
డైరెక్టర్ అభిలాష్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నవ్వించాడు. అప్పుడే సినిమా డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుందని నమ్మకం వచ్చింది. చిన్నచిన్న డౌట్స్ ఉంటే మారుతి వద్దకి, తీసుకువెళ్లి వినిపించాం. ఆయన విని చాలా బాగుందని చెప్పి, ఫస్ట్ కాపీతో రమ్మని చెప్పారు. ఫస్ట్ కాఫీ తీసుకెళ్లి ఆయనకి చూపించాం. సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. సరైన దారిలో సినిమాని తీసుకెళ్లారని అభినందించారు.
టైటిల్ సెలక్షన్ డైరెక్టర్‌దే. వెంకటేష్ కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ ‘పెళ్లి కాని ప్రసాదు’. ఈ కథకి ఈ టైటిల్ పర్ఫెక్ట్. ఆ టైటిల్ వెయిట్‌ని కాపాడేలా ఉంటుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. అనిల్‌కి థాంక్స్ చెప్తున్నాను. శిరీష్ ఈ సినిమా చూసి మమ్మల్ని అభినందించారు. ఈ సినిమాని ఎస్వీిసిలో రిలీజ్ చేయడం మా అదష్టంగా భావిస్తున్నాం. నా కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాక్టర్‌గా దిల్ రాజు బ్యానర్‌లోనే మొదలైంది. వాళ్ళు కంటెంట్ నచ్చితేనే సినిమాని రిలీజ్ చేస్తారు. మా సినిమాని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
ప్రభాస్, వెంకటేష్, దిల్ రాజు, శిరీష్, మారుతి, అనిల్ రావిపూడి అందరూ చాలా హెల్ప్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమాతో ఆద్యంతం నవిస్తాం.

ఆద్యంతం నవ్విస్తాం
Written by RAJU
Published on: