
నవతెలంగాణ – భువనగిరి
ఆదర్శ జీవి చండ్ర రాజేశ్వరరావు ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం ఆవరణలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రజల నాయకులు ఆదర్శ జీవి చండ్ర రాజేశ్వరరావు 31 వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించాలని 1944 భువనగిరిలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో పర్యటనలు చేసి దళాలను చైతన్యపరిచినాలని వారి జీవితంలో పార్టీ నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు
భారతదేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల తదుపరి పార్టీ అంతర్గత విషయాలు క్రమశిక్షణతో ముందుకు వెళ్లారని పలు రాష్ట్రాలలో భూ ఆక్రమణ పోరాటాలు నిర్వహించి వేల ఎకరాలను పంపిణీ చేయించారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ ,కొల్లూరి రాజయ్య, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, ప్రజాసంఘాల నాయకులు దాసరి లక్ష్మయ్య, ఉప్పుల కొమురయ్య, ఎలగందుల అంజయ్య, జక్కదయాకర్ రెడ్డి, తెడ్డు ఆంజనేయులు నరిగె యాదయ్య బోదాసు స్వామి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.