ఆంధ్రా-ఒడిశా ఎక్సైజ్‌ అధికారుల దాడులు | Raids by Andhra-Odisha excise officers

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Apr 25 , 2025 | 11:55 PM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు.

ఆంధ్రా-ఒడిశా ఎక్సైజ్‌ అధికారుల దాడులు

సారా తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ అధికారులు

1,120 లీటర్ల సారా స్వాధీనం

10,600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

పాతపట్నం, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. శ్రీకాకుళం డీపీఈవో సీహెచ్‌ తిరుపతినాయుడు, గంజాం జిల్లా ఈఎస్‌ ప్రదీప్‌కుమార్‌ సాహు సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రాలోని పాతపట్నం, కొత్తూరు మండలాల ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని ఒడిశా గ్రామాలైన సింగుపురం, నేరేడిగూడ, శిరడా, గురిసింగి గూడ తదితర గిరిజన గూడలతో పాటు సమీపంలోని కొండలపై గ్రామాల్లోనూ ముమ్మరంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా సుమారు 10,600 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసి 1,120 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు తిరుపతినాయుడు తెలిపారు. జిల్లా సహాయ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌చార్జి ఏఈఎస్‌ ఎం.శ్రీనివాసరావు, పాతపట్నం ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కోట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date – Apr 25 , 2025 | 11:55 PM

Google News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights