ఆంధ్రజ్యోతి-వైద్య జ్యోతి నేడే

Written by RAJU

Published on:

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో వైద్యజ్యోతి పేరిట నేడు, రేపు మెగా హెల్త్‌మీట్‌ జరగనుంది. తిరుపతి తుడా కార్యాలయం సమీపంలోని ఇందిరా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం పదిన్నర గంటలకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ వైద్యజ్యోతి ఆరోగ్య శిబిరం ప్రారంభించనున్నారు. శని, ఆదివారాల్లో జరిగే హెల్త్‌ మీట్‌లో నగరంలోని పలు ప్రసిద్ధ ఆసుపత్రులు, హెల్త్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో లభించే వైద్యసేవలు వివరిస్తారు. ప్రజలకు ఆరోగ్య అవగాహన కలిగిస్తారు. రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే వైద్యజ్యోతిలో రోగులను పరీక్షించి, అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. అదేవిధంగా కొన్నిరకాల మందులను కూడా ఉచితంగా అందించనున్నారు.

హెల్త్‌మీట్‌లో ఉచిత వైద్య సేవలు : వెంకటరమణ గుండె, మెటర్నిటీ హాస్పిటల్‌ స్టాల్‌లో ఈసీజీతో పాటు గుండె సంబంధిత వైద్య పరీక్షలు, తగు సూచనలు ఇస్తారు. మనోహరి రామచంద్ర హాస్పిటల్‌, అంకుర హాస్పిటల్స్‌ వారు గర్భిణులు, తల్లి కావాలనుకునే మహిళలకు ఆరోగ్య సలహాలు ఉచితంగా ఇస్తారు. గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భస్థ శిశువుల ఆరోగ్య మెలకువలను వివరిస్తారు. ఆస్టర్‌ నారాయణాద్రి హాస్పిటల్‌ వారు ఆర్థోపెడిక్‌ వ్యాధులపై అవగాహన కల్పిస్తారు. ఇంకా డీఎన్‌ఆర్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, యష్‌ హాస్పిటల్స్‌, శ్రీసాయి సుధా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌, డీబీఆర్‌ అండ్‌ ఎస్కే క్యాన్సర్‌ సెంటర్‌, మెడిగో హాస్పిటల్స్‌, సన్‌ప్రైమ్‌ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్‌ వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేయడంతో పాటూ, తగు సలహాలు, సూచనలు చేస్తారు. కాకర్ల డెంటల్‌ హాస్పిటల్‌, క్రిష్ణతేజ డెంటల్‌ హాస్పిటల్స్‌ వారు దంత సంబంధిత సమస్యలు, అధునాతన దంత వైద్యంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (ఎన్‌బీకే) ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులు పి.మనోహర్‌ రెడ్డి, కెపి చౌదరిలు ప్రధాన స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తుండగా సీపీఆర్‌ కనస్ట్రక్షన్స్‌ వారు కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.

Subscribe for notification