సిరిసిల్ల /సిరిసిల్ల రూరల్ మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పార్టీ నాయకులు కలిసిమెలిసి ఉండాలని, అసమ్మతి రాజకీయాలు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివా రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు ఫంక్షన్ హాల్‌లో జిల్లా బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మే ళనం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపి బాధ్యతలను స్వీకరించారు. బండి సంజయ్‌ను రగుడు చౌరస్తా బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతించారు. ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజ య్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావర ణం ఉందని, దాన్ని చెడగొట్టొద్దని సూచించారు. రాబో యేవి కార్యకర్తల ఎన్నికలేనని, స్థానిక ఎన్నికల్లో కార్యక ర్తలను గెలిపించాల్సిన బాధ్యత మాదని అన్నారు.. సెస్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. భయపెట్టి బెదిరించి బీఆర్‌ఎస్ గెలిచినట్లు అరాచకాలు చేసిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్‌దేన ని, ఎవరెన్ని చేసినా ప్రజలు బీజేపీవైపే ఉన్నారన్నారు. గోపి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత లు చేపట్టడం సంతోషకరమన్నారు. తనకు గ్రూపుల్లేవని, తన ఒకటే బీజేపీ గ్రూప్, మోదీ గ్రూప్ మాత్రమేనన్నా రు. సిరిసిల్ల కార్యకర్తలు పోరాటయోధులని, బీఆర్‌ఎస్ పాలనలో యువరాజు సిరిసిల్లకు వస్తుంటే అడుగడుగు నా అడ్డు కుని ప్రజావ్యతిరేక పాలనపై పెద్దఎత్తున పోరా టాలు చేశారని, ఆ భయానికే యువరాజు తాను వచ్చేముందు బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్‌లు చేసి జైలుకు పంపేటోడన్నారు. అయినా తెగించి కొట్లాడిన చరిత్ర బీజేపీ సిరిసిల్ల కార్యకర్తలదన్నారు. అధికారం ఉందని అరాచకాలు చేసే సంసృతి బీజేపీకి లేదని, అధి కారం శాశ్వతం కాదని, ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచి పోయి, వారి సమస్యలను పరిష్కరించడమే మన బాధ్య త అన్నారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులి స్తోందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేం ద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రం నయాపైసా ఇస్తలేని, అయినా తెలంగాణకు కేంద్రం ఏ మిచ్చిందని ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తా మో చేతల్లో చూపిస్తామని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, బీఆర్ ఎస్ చేసిన స్కాంల్లో అరెస్ట్ కాకుండా కాపాడుతోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ ఫార్ములా. ఈ రేసు, భూముల కుంభకోణం, కాళేశ్వరం సహా అన్ని స్కాము ల్లో కేసీఆర్ కుటుంబం ఉందని తెలిసినా అరెస్ట్ చేయలే దన్నారు. కనీసం నోటీసులు కూడా ఇచ్చే దమ్ములేదని అన్నారు. కనీసం కేసీఆర్‌ను విచారణకు పిలిచే దమ్ము లేదని, ఎందుకంటే రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కలిసి పనిచేస్తున్నా యని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ల లెక్కలు తేలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్‌రావు, కో కన్వీనర్ అడె పు రవీందర్. వేములవాడ ఇంచార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు,బీజేపీ రాష్ట కార్యదర్శి లింగంపల్లి శంకర్, రా ష్ట కమిటీ సభ్యులు అల్లాడి రమేష్, ఎర్రం మహేష్,హ నుమంతు గౌడ్, రాంప్రసాద్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మహిళమోర్చ జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ల, ని యోజవర్గ ఇంచార్జి మల్లారెడ్డి ,పట్టణ ఆధ్యక్షుడు నాగు ల శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.