
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
ఇంద్రా రామ్‌ను హీరోగా,నిఖిల్ గొల్లమారి దర్శకుడిగా ఆయన ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు.
నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొం దిన ఈ మూవీకి వి.చూడమణి సహ నిర్మాత. ఈ సినిమా నేడు (శుక్రవారం) థియేటర్ల లోకి రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత త్రినాథరావు నక్కిన మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
కార్తిక్ ఘట్టమనేని ఫాదర్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశారు. ఆయన సర్వీస్‌లో ఉన్నప్పుడు ఓ చిలిపి దొంగతనం కేసు జరిగింది. ఆ సంఘటన గురించి కార్తిక్ చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది సినిమాగా చేయమని కార్తిక్‌ని అడిగాను. దీన్ని బేస్ చేసుకుని తను ఈ కథ తయారు చేశాడు. అయితే ఆ కేసుని యధాతథంగా తీసుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పూర్తి సినిమాటిక్‌గా చేశాం.
ఇంద్ర రామ్ కొత్త అబ్బాయి. మొదట్లో నేను కాస్త భయపడ్డాను. వర్క్ షాప్ చేశాం. సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న భయం ఉండింది. అయితే రెండు రోజుల తర్వాత క్యారెక్టర్ పట్టేశాడు. అద్భుతంగా చేశాడు. తనే కాదు ఇందులో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో క్యారెక్టర్స్ తప్ప ఆర్టిస్టులు కనిపిం చరు. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. రాజీవ్ కనకాల పాత్ర చాలా సర్‌ప్రైజ్ చేస్తుంది.
నిఖిల్‌ని ‘కార్తికేయ’ షూటింగ్‌లో చూశాను. చాలా యాక్టీవ్‌గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకున్న సమయంలో నిఖిల్ పేరుని కార్తీక్ చెప్పాడు. ఈ సినిమాకి విజువల్ సెన్స్ ఉన్న డైరెక్టర్ కావాలి. నిఖిల్‌కి ఆ ఇమాజినేషన్ ఉంది. నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాని హెల్తీగా ఫినిష్ చేశాం. సినిమా చాలా మెచ్యుర్డ్‌గా ఉంటుంది.
ఈ సినిమాని కొంతమంది నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లకి చూపించాను. అందరూ మెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. బీజీఎం అద్భుతంగా చేశాడు. పాటలు మంచి హిట్ అయ్యాయి. మ్యూజిక్‌తోపాటు సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.