
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని జన్నారం మండలం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం జన్నారం మండలం తపాలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. అనంతరం ఆ గ్రామంలో చౌక ధరల దుకాణంలో ఏర్పాటు చేసిన పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. త్వరలో ఆరు గ్యారెంటీ స్కీములను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి గ్రామంలో అర్హుల లిస్టును తయారు చేస్తున్నామన్నారు. అర్హులకు పెన్షన్లు కూడా ఇస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్ ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, బండారి స్వామి, మామిడి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ సత్యం, మామిడిపల్లి ఇందయ్య రమేష్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.