– మధ్యాహ్నం వేళ మంట పుట్టిస్తున్న సూరీడు
– వేడిగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ సిటీ: నగరంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత(Temperature)లతో గ్రేటర్ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మార్చి రెండో వారంలోనే 39 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు చేరడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం హైదరాబాద్(Hyderabad)లో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, హకీంపేటలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు గృహాల్లో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఉదయం 10 గంటల నుంచే భానుడి తీవ్రత పెరుగుతుండటంతో ఎండలో రోడ్లపైకి వచ్చేందుకు నగరవాసులు ఆలోచిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం
మార్చి చివరినాటికి గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డి గ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందన్నారు. సాధారణ ప్రాంతాలతో పోల్చితే కొండ ప్రాంతాల్లో (రాక్ ఏరియా) 1-2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం గరిష్ఠం
హకీంపేట 38.7
హైదరాబాద్ 38.0
రాజేంద్రనగర్ 38.0
దుండిగల్ 37.8
హయత్‌నగర్ 37.6
పటాన్‌చెరు 36.4
ఈ వార్తలు కూడా చదవండి:
Arjun Reddy: గ్రూప్-3 టాపర్లూ పురుషులే..
నాగారంలోని ఆ 50 ఎకరాలు భూదాన్ భూములు కావు
కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై.. తుది దశకు సాధ్యాసాధ్యాల అధ్యయనం
మా సిఫారసు లేఖలు తీసుకోవాలి
Read Latest Telangana News and National News