అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

Written by RAJU

Published on:

  • నిప్పులు చెరుగుతున్న సూరీడు

  • 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా..

  • నిర్మల్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యధికంగా 40.7 డిగ్రీలు

  • రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్‌లో 38.6 డిగ్రీలు

  • నేడు, రేపు ఆరెంజ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): వేసవి కాలం ప్రారంభమైందో లేదో అప్పుడే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మున్ముం దు పరిస్థితి తలుచుకుంటే హడలిపోయేలా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుండగా.. పగటి ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలు దాటేశాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో గురువారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే రోజు కేవలం రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి.

నిర్మల్‌జిల్లా కడ్డం పెద్దూర్‌ మండలం లింగాపూర్‌లో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 40.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. ఇక, రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్‌లో గురువారం 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేం ద్రం.. శుక్ర, శనివారాల్లో పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పగ టి ఉష్ణోగ్రతలు సగటున 38-41 డిగ్రీల మధ్య, రాత్రిపూట 19-23 డిగ్రీ ల మధ్య నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Subscribe for notification