దేశ దిశ

అమెరికా నుంచి మట్టికరిపించిన వియత్నాం.. 50ఏళ్ల తర్వాత మారిన సీన్!

అమెరికా నుంచి మట్టికరిపించిన వియత్నాం.. 50ఏళ్ల తర్వాత మారిన సీన్!

అమెరికా నుంచి మట్టికరిపించిన వియత్నాం.. 50ఏళ్ల తర్వాత మారిన సీన్!

వియత్నాం యుద్ధం అనేది ప్రపంచ చరిత్రలో ఒక భయానక చాప్టర్‌. వేల కొద్ది సైనికుల ప్రాణాలు బలైన ఈ యుద్ధం మానవతను తుంచేసిన ఉదంతంగా నిలిచిపోయింది. ఈ పోరాటంలో 13 లక్షల వియత్నాం సైనికులు మరణించగా, 20 లక్షల మందికిపైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 58 వేల అమెరికా సైనికులూ చనిపోయారు. గాయపడిన వారి సంఖ్య అంతులేని గణాంకంగా మిగిలిపోయింది. మానసికంగా శిధిలమైన యుద్ధ వీరుల కథలు ఇప్పటికీ అక్కడి వీధుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయినా చివరికి అమెరికా వెనక్కు తగ్గాల్సి వచ్చింది. శక్తిమంతమైన దేశం అయినా, వియత్నాం ప్రజల ధైర్యానికి, పట్టుదలకు ఎదురులేకపోయింది.

ఈ యుద్ధం 1955లో ప్రారంభమైంది . తొలుత ఫ్రాన్స్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వియత్నమిస్ బలగాలు పోరాటం సాగించాయి. అమెరికా అప్పట్లో ఫ్రాన్స్‌కు మద్దతుగా నిలిచింది. కమ్యూనిజం విస్తరణపై భయంతో అమెరికా చర్యలకు దిగింది. హోచిమిన్ నేతృత్వంలోని వియత్నాం బలగాలు 1954లో ఫ్రాన్స్ సైన్యాన్ని ఓడించగా, వియత్నాం స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అయితే జెనీవా ఒప్పందం ప్రకారం దేశం ఉత్తర, దక్షిణ విభాగాలుగా విడిపోయింది. ఉత్తర విభాగంలో కమ్యూనిస్టు ప్రభుత్వంతో అమెరికాకు మరోసారి భయం మొదలైంది. అదే ఈ యుద్ధానికి కారణమైంది.

1965 నుంచి 1973 వరకు అమెరికా వియత్నాంలో భారీగా బలగాలను మోహరించింది. బాంబుల వర్షం కురిపించింది. రసాయనాలతో అడవులను తుడిచేసింది. అయినా ప్రజల త్యాగం ముందు నిలబడలేక పోయింది. దేశీయంగా ప్రజా వ్యతిరేకత పెరిగింది. 1973లో పారిస్ ఒప్పందం కుదిరింది. అమెరికా వెనక్కు తగ్గింది. కానీ ఆ సమయంలో స్ప్రే చేసిన రసాయనాల ప్రభావంతో వియత్నాంలో ప్రజలు అనారోగ్యానికి లోనయ్యారు. జన్యుపరమైన లోపాలతో సంతానాలు జన్మించాయి. పంటలు, ప్రకృతి నాశనం అయ్యాయి. అయితే యుద్ధం ముగిసినా వియత్నాంపై ప్రమాదం తీరలేదు. ఇప్పుడు అమెరికా మరోరకంగా ఒత్తిడి తెస్తోంది. టారిఫ్‌లు పెంచుతూ ఆర్థికంగా దెబ్బకొడుతోంది. ట్రంప్ ప్రభుత్వ కాలంలో వియత్నాంపై విధించిన 46 శాతం దిగుమతి సుంకాలు ఆ దేశానికి గట్టి బాధే అయ్యాయి. తక్కువ వృద్ధి, దిగజారిన ఎగుమతుల మధ్య వియత్నాం ఇప్పుడు మరోసారి అమెరికా వత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇక ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వియత్నాం, గతంలో వంటి సమరస్ఫూర్తితోనే ఈసారి ట్రేడ్ యుద్ధానికి ప్రత్యుత్తరం ఇవ్వగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. రక్తసిక్త విప్లవాన్ని తట్టుకున్న దేశం ఇప్పుడు ఆర్థిక బలాన్ని నిలబెట్టుకోగలదా అన్నదే ప్రశ్న.

Exit mobile version