అమీన్‌పూర్‌లో దారుణం –

Written by RAJU

Published on:

అమీన్‌పూర్‌లో దారుణం –– పెరుగు అన్నం తిని ముగ్గురు పిల్లలు మృతి
– ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి
– ఫుడ్‌ పాయిజనా..? విష ప్రయోగమా?
– దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
నవతెలంగాణ-అమీన్‌పూర్‌
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. పెరుగుతో అన్నం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందగా.. వారి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. అయితే కుటుంబ కలహాలతో ఆ తల్లే విషం కలిపిందా..? లేక ఫుడ్‌ పాయిజన్‌ అయిందా..? లేదా మరేమైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని రాఘవేం ద్రకాలనీలో చెన్నయ్య, రజిత దంపతులు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్‌ ట్యాంకర్‌ నడుపుతుండగా, రజిత ప్రయివేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి కూతుర్లు, ఒక కొడుకు సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్‌ (8) ఉన్నారు. అయితే గురువారం రాత్రి రజిత, ముగ్గురు పిల్లలు పెరుగన్నం తినగా.. భర్త చెన్నయ్య పప్పన్నంతో భోజనం చేసి వాటర్‌ ట్యాంక్‌ ట్రాక్టర్‌తో చందానగర్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికొచ్చేసరికి ముగ్గురు పిల్లలు, భార్య పడుకొని ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమ యంలో రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో.. చెన్నయ్య వెంటనే ఇరుగుపొరుగు వారిని పిలిచి స్థానికంగా ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా, ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న రజిత పోలీ సులకు వాంగ్మూలం ఇచ్చిం ది. ఇంటికి సమీ పంలో ఉన్న దుకా ణంలో కొనుగోలు చేసిన పెరుగు కలుపుకుని అన్నం తింటుండగా స్పృహ కోల్పోయినట్టు పోలీసులకు తెలిపింది. తర్వాత ఏమి జరిగిందో తెలియదని చెప్పడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Subscribe for notification
Verified by MonsterInsights