అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Written by RAJU

Published on:

మంథని/రామగిరి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): అభి వృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం మంథని, రామగిరి మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామగిరి మండలాల్లో రూ.65 లక్షల డిఎంఎఫ్‌టీ నిధులతో సమీకృత అధికారుల సముదాయం, రూ.67 లక్షలతో కస్తూర్బా పాఠశాల ప్రహరీ, రోడ్డు పనులు, మంథని గోదావరితీరంలో రూ. 125 కోట్లతో వంతెన నిర్మాణం, మంథని గర్ల్స్‌ హైస్కూల్‌లో రూ.30లక్షలతో తరగతి గదుల పను లు, మంథని బస్టాండ్‌లో రూ.90 లక్షలతో మరమ్మ తు, మంథనిలో సమీకృత అధికారుల సముదాయం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సమీకృత అధికారుల భవన నిర్మాణాలతో ప్రజలకు సేవ అందుబాటులో ఉంటుందని పేర్కొ న్నారు. మంథని గోదావరిలో వంతెన నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత వ్యాపారులకు, ప్రజల కు లాభం కల్పిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యం చేకూరే విధంగా చర్యలు చేపడు తున్నట్లు తెలిపారు. అధికారులు జవాబుదారితనం పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజ లకు చేరువయ్యే విధంగా కృషి చేయాలన్నారు. పేద వారికే ఇందిరమ్మ గృహాలు అందే లా అధికారులు కృషి చేయాలన్నారు. అధికారులు ప్రణాళికబద్దంగా గృహ లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. చట్టానికి లోబడి మాత్రమే అధికారులు పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. రామగిరిలో పాఠకుల కోసం ఆధునిక సౌకర్యాలతో గ్రంఽథాలయం నిర్మిస్తామని అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్‌కు మంత్రి సూచిం చారు. మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, ఎస్‌ఈ పీఆర్‌ చక్రవర్తి, డీఈ నవీన్‌కుమార్‌, ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావు, ఎస్టేట్‌ అధికారి ఐలయ్య, తహసీల్దార్‌ సుమన్‌, ఎంపిడివో శైలజారాణి, అధికారులు, పోలీసులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

కస్తూర్బా విద్యార్థినులతో మాట్లాడిన మంత్రి

రామగిరి: పన్నూరు కేంద్రంలోని కస్తూర్బా విద్యార్థినులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పలకరించారు. మంచిగా చదువుకోవాలని, సమయానికి అన్నం పెడుతున్నారా అని తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడి సమస్యలపై వినతిపత్రాన్ని స్వీకరించారు. మండలంలోని రాజాపూర్‌ భూనిర్వాసితులను కలుసుకున్నారు. ఓసీపీ-2 ప్రాజెక్టు వల్ల ఇబ్బందులను తెలుసుకున్నారు. నిర్వాసితులకు అండగా ఉంటానని హమీ నిచ్చారు. రాజాపూర్‌ గ్రామస్థుల సమస్యపై కలెక్టర్‌కు ఫోన్‌లో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights