
నవతెలంగాణ – ముధోల్
తన హయాంలో అభివృద్ధిని కొంతమంది అడ్డుకుంటున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆరోపించారు. నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. కొంతమంది నాయకులు కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. తనహయంలో తనకు మంచి పేరు వస్తుందని కొంతమంది నాయకులు దురుద్దేశంతో అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిని కోరుకునేవారికి పార్టీల అతీతంగా తన సహయ సహకారాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ కావడంతో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఆనంతరం ముధోల్, తానుర్ మండలాలకు చెందిన 63 కళ్యాణ్ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, ముధోల్ తహశీల్దార్ శ్రీకాంత్, తానుర్ తహశీల్దార్ లింగమూర్తి, మండల బిజెపి అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు మోహన్ రెడ్డి, తాటివార్ రమేష్, శ్రీనివాస్, సతీష్ రేడ్డి, రాజేంధర్, దేవోజీ భూమేష్, సంతోష్, జీవన్, శీవాజీ పటేల్, చిన్నరేడ్డి, తదితరులు పాల్గొన్నారు.