ఇలాంటి పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న అనిల్ కు తామున్నామంటూ కొడుకులిద్దరూ అండగా నిలిచారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కంపెనీ షేర్లు రాకెట్లా దూసుకుపోతున్నాయి. ఇంతకీ కుబేరుడైన అనిల్ అంబానీ అప్పుల ఊబిలో ఎలా కూరుకుపోయారు? వాటి నుంచి ఆయన కొడుకులిద్దరూ ఎలా బయటపడేస్తున్నారు..? అంబానీ.. ఈ పేరంటేనే సంపదకు చిహ్నం. పెట్రోల్ బంకులో పనిచేసి మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు ధీరూబాయ్ అంబానీ. ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని నిరూపించారు. ఆయన కుమారులే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో వినిపించే పేరు ముఖేష్. కానీ ఒకప్పుడు అన్న కన్నా ఎక్కువ ఆస్తి ఉన్న అనిల్ పేరు మాత్రం ఇప్పుడు ఆ లిస్టులో కనిపించదు. రెండు దశాబ్దాల క్రితం వరకు అనిల్ ఓ సెన్సేషన్.. కానీ ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్ బిజినెస్ మేన్. అందుకే అనిల్ గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. అయితే ఆయన దుస్థితికి కారణం స్వయంకృతాపరాధం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“గోలీ సోడా” ఇప్పుడు “గ్లోబల్ సోడా”.. ప్రపంచ వేదికపై అద్భుతాలు సృష్టి
నగ్నంగా ఎయిర్‌పోర్ట్‌లో బీభత్సం సృష్టించిన మహిళ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్ కాల్.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు