అదే ఈ బర్త్‌డే ప్రత్యేకత…

Written by RAJU

Published on:

అదే ఈ బర్త్‌డే ప్రత్యేకత…విలక్షన్‌ నటుడిగా, నిర్మాతగా అటు సినిమా రంగంలో, విద్యావేత్తగా ఇటు విద్యారంగంలో డాక్టర్‌ మంచు మోహన్‌ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ప్రజా నాయకుడిగా తనదైన మార్క్‌తో చెరగని ముద్ర వేశారు. నేడు (బుధవారం) ఆయన పుట్టినరోజు. ఈ పుట్టిన రోజుతో ఆయన 73వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి ఓ బిగ్‌ అప్డేట్‌ రాబోతోంది. ఈ చిత్రంలో మోహన్‌ బాబు మహాదేవశాస్త్రి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్‌డే సందర్భంగా మహ దేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఆయన బర్త్‌డే నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలను మీడియాతో షేర్‌ చేసుకుంది. 1975 నుంచి 1990 వరకు భారతీయ సినిమాల్లో విలన్‌ పాత్రకు మోహన్‌ బాబు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. 1990వ దశాబ్దంలో ఆయన హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. ‘అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. ఆయన నటించిన అనేక చిత్రాలు హిందీ, తమిళ భాషల్లో రీమేకై, అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. ఎక్కువ చిత్రాలు నిర్మించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. సినిమా రంగంలో విశేష విజయాలను సాధించిన ఆయన శ్రీ విద్యానికేతన్‌ విద్యా ట్రస్ట్‌ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, విశేష సేవలను అందిస్తున్నారు.

Subscribe for notification