అడుగంటుతున్న ఎల్లంపల్లి…!

Written by RAJU

Published on:

-ప్రాజెక్టులో ఘననీయంగా తగ్గిన నీటి మట్టం

-20టీఎంసీలకు ప్రస్తుతం 9 టీఎంసీల నీరు

-సాగునీటి సరఫరా నిలిపివేసే యోచనలో అధికారులు

-జాగ్రత్తలు తీసుకుంటేనే తాగునీటికి భరోసా

-మరో రెండు నెలలు ఇదే పరిస్థితి

మంచిర్యాల, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేట గ్రామంవద్ద గోదా వరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం ఘననీయంగా తగ్గుముఖం పడుతోంది. ఓ వైపు ఎం డలు ముదరడం, మరోవైపు వివిధ పనుల నిమిత్తం నీటి కేటాయింపులతో ప్రాజెక్టులో నీటి మట్టం అట్ట డుగుకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నిత్యం 597 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. హైద్రాబాద్‌ ప్రజ ల తాగునీటి అవసరాల కోసం హైద్రాబాద్‌ మెట్రో వర్క్‌ స్కీం (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌)కోసం 331 క్యూసె క్కులు, రామగుండంలోని ఎన్టీపీసీ పంప్‌ హౌజ్‌కు 121 క్యూసెక్కులు, గూడెం పంప్‌హౌజ్‌కు 181 క్యూ సెక్కులు, పెద్దపల్లి, రామగుండం మిషన్‌ భగీరథ ప థకం కోసం 58 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుం డగా, మంచిర్యాల జిల్లా ప్రజల తాగునీటి అవసరా ల కోసం 23 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే ఎండల కారణంగా ఆవిరి రూపంలో 190 క్యూసెక్కుల నీరు వృధా అవుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో వేమునూరు పంప్‌ హౌజ్‌, నంది పంప్‌హౌజ్‌లకు నీటి విడుదల నిలిపివేశారు.

ఉన్నవి 9 టీఎంసీలే….

ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా శుక్రవారం నాటికి 9.03 టీఎంసీలకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 7.23 టీ ఎంసీల నీరు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు టీఎంసీల మేర నీరు అధనం గా ఉంది. ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగరీథ పంప్‌ హౌజ్‌కు నీరందించే ఇన్‌టెక్‌ వెల్‌ వద్ద కొద్ది రోజు లుగా నీరు పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. గతే డాదితో పోలిస్తే ప్రాజెక్టులో నీటి మట్టం కొంతమేర ఆశాజనకంగా ఉండటంతో తాగునీటి అవసరాలకు ఢోకా లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు జూన్‌ వరకు తాగు నీటి అవసరాలు తీరుస్తుందని అంటున్నారు.

ఈ నెల 15 నుంచి సాగునీరు నిలిపివేత….

ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంతో సంబంధిత అధికారులు ముం దస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగం గా ఈ నెల 15 నుంచి సాగునీటి విడుదలను పూ ర్తిగా నిలిపివేయనున్నట్లు గూడెం పంప్‌హౌజ్‌ అధి కారులు ప్రకటించారు. ఆ రోజు నుంచి పంప్‌హౌజ్‌ మోటార్లు నిలిపివేయనున్నట్లు ముందస్తుగా రైతులు కు సమాచారం ఇచ్చారు. రైతులు వ్యవసాయ కార్య క్రమాలు అందుకు అనుగుణంగా చేపట్టాని సూచిం చారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దండేపల్లి, లక్షెట్టిపే ట, హాజీపూర్‌ మండలాల్లో యాసంగి సాగునీటి అవ సరాల కోసం ప్రస్తుతం 181 క్యూసెక్కుల నీటిని ఎ ల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వినియోగిస్తున్నారు. యా సంగి సాగుకూడా చివరి దశకు చేరుకున్నందున నీటివిడుదల నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాగా ఈ నెల చివరి వరకు నీరు ఇస్తే పంట చేతిక వస్తుందని రైతులు మొర పెట్టుకుంటున్నారు. కనీ సం 22వ తేదీ వరకైనా నీరు ఇవ్వాలని, లేనిపక్షంలో వడ్లు గట్టిపడక, తాలుగా మారిపోయే ప్రమాదం ఉంటుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు కో రినట్లు ఇస్తే తాగునీటి అవసరాల కోసం ఇబ్బందు లు పడాల్సి వస్తుందనే భావనలో అధికారులు ఉన్నారు.

రెండు నెలలు గడ్డు పరిస్థితే…

ఎల్లంపల్లి ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం పడిపోతుండటం, వివిధ అవసరాలకు పెద్దమొత్తం లో నీరు విడుదల చేయాల్సి ఉండటంతో అధికారు లు తలలు పట్టుకుంటున్నారు. మరో రెండు నెలల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదు. కనీసం జూన్‌ వరకైనా అందుబాటులో ఉన్ననీటినే పొదుపుగా వా డుకుంటే, తర్వాత వర్షాలు కురిసి నీటి ఇబ్బందులు తొలుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights