
ఇంకా ఈ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్, సీనియర్ హీరో రాంకి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీస్ చైర్మన్ హరి గోవింద ప్రసాద్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ సి.యి.ఓ రాహుల్, రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సి.యి.ఓ శ్రీవికాస్, సివిల్ కోర్ట్ జడ్జి సురేష్, అంబేద్కర్ యాక్టివిస్ట్ అనిత, సినిటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమాని పాల్గొని, ఈ సినిమా అసాధారణ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కుల మత ప్రాంత, వర్గ వైషమ్యాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం కషి చేసిన అంబేద్కర్‌కు గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలతో తెరకెక్కించామని హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మంథాని కష్ణచైతన్య తెలిపారు.