– తహశీల్దార్ కు నాగ్లూర్ గ్రామస్తులు వినతిపత్రం
నవతెలంగాణ గాంధారి
గాంధారి మండలంలోని నాగ్లూర్ గ్రామంలో గల ఊట చెరువు నుంచి గ్రామానికి చెందిన కొందరు భూస్వాములు అక్రమంగా మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ మట్టి తవ్వకం ఆపాలని గ్రామంలో తీర్మానం చేసిన గ్రామంలోని కొందరు భూస్వాములు మాఫియా త కలిసి చెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గత ఎనిమిది రోజులుగా అక్రమంగా మట్టిని తవ్వి లక్షల రూపాయలు అర్జించారని గ్రామస్తులు ఆరోపిస్తూ బుధవారం తాసిల్దార్ కార్యాలయానికి వచ్చి తాసిల్దార్ రేణుక చావన్ కు ఫిర్యాదు చేశారు. చెరువు భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే వరకు మట్టి తవ్వకం ఆపాలని ఇరిగేషన్ ఏఈకి తాసిల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు. గ్రామస్తులు ఇరిగేషన్ ఏఈతో వాగ్వివాదానికి దిగారు. ఏ ఈ అసమర్థత వల్లే ఎనిమిది రోజులుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. తాసిల్దార్ కల్పించుకుని సర్వే చేసి హద్దులు నిర్ణయించే వరకు మట్టి తీసేది లేదని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు.

అక్రమంగా చెరువు నుండి మట్టి తరలింపును ఆపండి.. –

Written by RAJU
Published on: