– మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– జపాల్‌లో ఇఫ్తార్ విందుకు హాజరు
నవతెలంగాణ-మంచాల
గ్రామాల్లో అందరూ సోదర భావంతో మెలగాలని, అన్నీ పండుగలు అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం జపాల్ గ్రామంలో కో-ఆప్షన్ మాజీ సభ్యులు ఓరుగంటి భాస్కర్‌గౌడ్ ముస్లిం సోదరులకు శనివారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాన్‌వెస్లీ, జిల్లా నాయకులు హాజరై ముస్లీం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం కర్ఖూర తినిపించి.. ఉపవాసం విడిపించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉపవాసం నిర్వహించడం వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. కుల, మతాలకు అతీతంగా ఏర్పాటు చేసే ఇప్తార్ విందులు మతసామరస్యానికి ప్రతిక అని అన్నారు. ప్రజలు ఐక్యమత్యంతో ఉండాలన్నారు. ముస్లీంల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, వారి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో మతకలహాలకు తావు లేదని, ఇక్కడి ప్రజలు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఓరుగంటి భాస్కర్‌గౌడ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, అబ్బాస్, పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పార్టీ మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, నాగిల్ల శ్యామ్ సుందర్, మండల కమిటీ సభ్యులు యాట జగన్, అన్నారం లెనిన్, గ్రామ కమిటీ కార్యదర్శి కుకుడాల పాపిరెడ్డి, మాజీ ఎంపీటీ లట్టుపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు ఆవుల నరసింహ, యాట సత్యం, సయ్యద్ రజాక్ పాషా, సయ్యద్ రావుఫ్, పేర్మండ్ల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.