అందరికీ కనెక్ట్‌ అయ్యే ‘కృష్ణ లీల’

Written by RAJU

Published on:

అందరికీ కనెక్ట్‌ అయ్యే ‘కృష్ణ లీల’దేవన్‌ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్‌ నేచురల్‌ లవ్‌ స్టొరీ రూపోందుతోంది. ధన్య బాలకృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్‌ విజువల్స్‌ బ్యానర్‌ పై జ్యోత్స్న జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘కృష్ణ లీల’ అనే బ్యాటీఫుల్‌ టైటిల్‌ ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్‌, ఎల్‌ వీ గంగాధర్‌ శాస్త్రి, డీవోపీ చోటా కే నాయుడు హాజరయ్యారు. హీరో నిఖిల్‌ మాట్లాడుతూ,’దేవన్‌ చాలా ప్యాషన్‌ ఉన్న యాక్టర్‌, డైరెక్టర్‌. ‘హ్యాపీడేస్‌’కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు ‘హ్యాపీడేస్‌’ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి ఈ సినిమాతో దేవన్‌కి పెద్ద హిట్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోషన్‌ పోస్టర్‌ నాకు చాలా నచ్చింది. ఇందులోని దేవ్‌ డిఫరెంట్‌ షేడ్స్‌ నాకు చాలా నచ్చాయి’ అని అన్నారు. ‘నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న, అనిల్‌కి ధన్యవాదాలు. వారికి లైఫ్‌ లాంగ్‌ రుణపడి ఉంటాను. చోటా కే నాయుడు నాకు ఇష్టమైన కెమెరామెన్‌. ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫైనల్‌గా ఆయనని కలిసి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు. అవి మాకు చాలా హెల్ప్‌ అయ్యాయి. ఆయనే నాకు ఇండిస్టీలో బ్యాగ్రౌండ్‌. ఈ జర్నీ ఒక మిరాకిల్‌లా మొదలైంది. గంగాధర్‌ శాస్త్రికి కూడా ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కూడా నాకు విలువైన సూచనలు ఇచ్చారు. ’18పేజస్‌’ నుంచి నిఖిల్‌తో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్‌ చేశారు. ఈవెంట్‌ కొచ్చి మాకు సపోర్ట్‌ చేసిన నిఖిల్‌కి థ్యాంక్స్‌’ అని హీరో, డైరెక్టర్‌ దేవన్‌ చెప్పారు. ప్రొడ్యూసర్‌ జ్యోత్స్న మాట్లాడుతూ,’మా సినిమా నిజంగా ఒక అద్భుతం. ప్రతి ఒక్కరినీ జీవితంలో కనెక్ట్‌ చేసే పాయింట్స్‌ ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు. ‘ప్రేమ గురించైనా, యుద్ధం గురించైనా చెప్పాలంటే కృష్ణుని పేరే చెప్తాం. ఎవరైతే కరెక్ట్‌గా ప్రేమించగలరో అతనికి మించి యుద్ధం చేసేవాడు ఎవరు ఉండరు . దేవన్‌ చాలా డెడికేటెడ్‌గా పని చేశాడు’ అని స్టోరీ రైటర్‌ అనిల్‌ కుమార్‌ చెప్పారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights